చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. కొమరిన్ శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. తదుపరి 48 గంటల్లో ఇది బలపడి వాయివ్య దిశగా పయణించి తీవ్రఅల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీని ప్రభావంతో ఆది, సోమ వారాల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అంతే కాకుండా రాయలసీమజిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.