క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే ఇవి అస్సలు చేయకండి..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్స్ యొక్క వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే ఈ కార్డుని వాడడం వలన ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు. అదే విధంగా కొన్ని ఇబ్బందులు కూడా క్రెడిట్ కార్డుని వాడడం వలన ఉంటాయి.

కనుక క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కొన్ని పనులు అస్సలు చెయ్యకుండా ఉండడం మేలు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కొన్ని కొన్ని సార్లు అవసరంగా ఈ పనులు చెయ్యకండి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది.

క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దు. ఎందుకు ఈ పని చెయ్యకూడదు అనేది చూస్తే.. క్రెడిట్ కార్డుని ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకున్నారు అంటే అధిక వడ్డీ భారం పడుతుంది. అలానే ఇంకా క్యాష్ అడ్వాన్స్ ఫీజు చెల్లించుకోవాలి.

కాబట్టి ఈ పనిని చెయ్యకండి. అలాగే మినిమమ్ బ్యాలెన్స్ పేమెంట్ కూడా చేయొద్దు. ఇలా చేస్తే 40 శాతం వరకు వడ్డీ చెల్లించక తప్పక. కాబట్టి క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చెయ్యకండి.

Read more RELATED
Recommended to you

Latest news