రాష్ట్రంలో మరో రెండురోజులు వానలు…

మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకో రెండురోజులు పాటు భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు సాయంత్రం నుండి సోమవారం(రేపు) ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో పాటు వర్షం కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

Southwest monsoon vigorous in TS, Hyderabad to witness rains over weekend -  Telangana Today

అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా పడుతాయని తెలిపింది. అలాగే సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు సైతం పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.