బీభత్సం సృష్టిస్తున్న చెడగొట్టు వానలు.. ఆ జిల్లాలో రాకపోకలు బంద్‌

-

తెలంగాణలో అకాల వర్సాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెడగొట్టు వానలు రైతులతో పాటు.. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన..గార్ల, డోర్నకల్ మధ్య రాకపోకలను నిలిపివేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం. గార్ల మండలల్లో భారీ వర్షం కురిసింది.

heavy rain | 17 killed as wall collapses in Tamil Nadu village following  heavy rain - Telegraph India

ఉరుములు.పిడుగులు వర్షం బీభత్సం సృష్టించింది. గాలి దుమారంతో కూడిన వానకు గార్ల మండంలోని రహదారిపై పెద్ద. పెద్ద చెట్లు విరిగిపడిపోయాయి. దీంతో గార్ల..డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు పైనే చెట్లు విరిగిపడటంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై పడిన చెట్లను వాహనదారులే తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మోచా తుఫాన్‌ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకావం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news