గత ఐపీఎల్ లో చివరి వరకు పోరాడి టైటిల్ ను దక్కించుకోవడంలో కొంచెంలో రాజస్థాన్ రాయల్స్ మిస్ అయింది. ఈ టీం కు కెప్టెన్ గా ఉన్న సంజు శాంసన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ జట్టు విజయపధంలో నడవడానికి ప్రధాన కారణం సంజు శాంసన్, బట్లర్ , జైస్వాల్, హెట్ మెయిర్, అశ్విన్ మరియు బౌల్ట్ లు అని చెప్పాలి. అయితే ఈ జట్టులో గత కొన్ని సీజన్ లుగా కొనసాగుతున్న ఒక ఆటగాడు ఇప్పుడు జట్టుకు భారంగా మారాడని కామెంట్ లు వినిపిస్తున్నాయి. అతలెవరో కాదు ఐపీఎల్ కు ముందు ఓవర్ కాంఫిడెన్స్ కామెంట్ లతో సందడి చేసిన దేశవాళీ ఆటగాడు రియాన్ పరాగ్.
ఇతను ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ చరిత్రలో కేవలం రెండే రెండు అర్ద సెంచరీలు చేశాడు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్ లోనూ ఏమంత రాణించలేకపోతున్నాడు. అవకాశాలు వస్తున్న బంతిని సరిగా మిడిల్ చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. అందుకే ఇతన్ని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ ఎక్కువవుతోంది. మరి రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలి.