తినడానికి తిండి కూడా లేక ఎన్నో అవస్థలు పడ్డాను అంటున్న రాజేంద్ర ప్రసాద్..!!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ, నవ్విస్తూ, గొప్ప పొజిషన్ కు వచ్చిన హీరోలలో రాజేంద్రప్రసాద్ ఒకరు. రాజేంద్ర ప్రసాద్ అంటే నవ్వు మాత్రమే కాదు. నవరసాలు మొత్తం కలగలిపి ఉన్న హీరో అని చెప్పవచ్చు. అయితే ఈ హీరో అవకాశాలు తగ్గినా కూడా వేరు వేరు పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలో స్థిరపడడానికి ఎంతో కష్టపడ్డాడు.Rajendra Prasad (actor) - Wikipedia

రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో మొట్టమొదటి కామెడీ హీరో అని చెప్పవచ్చు. దాదాపు పాతిక సంవత్సరాల పాటు హీరోగా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అంతే కాకుండా తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినిమాలపై మక్కువ ఎక్కువ పెంచుకొని.. సీనియర్ ఎన్టీఆర్ ప్రభావంతో ఆయన నటనపై ఆసక్తి చూపించాడు. మిమిక్రీ లను చేస్తూ సీనియర్ ఎన్టీఆర్ ను తలపించే వారు. చివరికి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నై లోని ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి గోల్డ్ మెడల్ సాధించారు.Actor Rajendra Prasad Test Positive For Covid 19 | Rajendra Prasad: సీనియర్ నటుడికి కరోనా.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..

అయినా కూడా ఆయనకు సినిమా అవకాశాలు లభించలేదు. అని చెప్పవచ్చు. దీంతో ఆకలి పస్తులతో చాలాకాలం చెన్నైలోనే జీవితాన్ని వెళ్ల తీశాడు. చివరికి ఓపిక నశించడం తో చావు తప్ప మరో మార్గం లేదని భావించాడట రాజేంద్ర ప్రసాద్. ఈ సమయంలోనే ఒక అవకాశము ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిందట. ఆ తర్వాత ఆ అవకాశం ఆయన్ని ఒక మలుపు తిప్పింది. రాజేంద్రప్రసాద్ కి దగ్గర బంధువు అయిన సినీ నిర్మాత అల్లూరి పుండరీకాక్షయ్యను కలిశారు. ఆ సమయంలో ఆయన ఎన్టీఆర్ తో మేలుకొలుపు మూవీ తీసుకున్నారు.రాజేంద్ర ప్రసాద్ కమర్షియల్ హీరో కాలేకపోవడానికి ఎన్.టి.ఆర్ కారణం ..? | The Telugu News

ఇక పోతే ఆ చిత్రంలోని ఒక తమిళ నటుడు తరుపున డబ్బింగ్ చెప్పించారు. ఆయన దీంతో కొన్నాళ్లపాటు డబ్బింగ్ చెపుతూనే ఎప్పటిలాగా మళ్లీ అవకాశాల కోసం పరితపించాడు. అలా బాపు దర్శకత్వంలో తెరకెక్కించిన స్నేహం సినిమాలో చిన్న పాత్ర దక్కింది రాజేంద్ర ప్రసాద్ కి అలా ఆయన గురించి తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news