వీడిన పెళ్లికూతురు సృజన మృతి మిస్టరీ.. బయటపడ్డ ఇన్స్టా చాటింగ్‌..

మధురవాడలో నవ వధువు సృజన మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ మృతిపై మిస్టరీని పోలీసులు ఛేదించారు. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్‌ చేసినట్టు తెలిపారు పోలీసులు.

Vizag Bride death case: Family members deny suicide rumours, asks to wait  for the postmortem report

కాగా, సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్‌.. సృజనను కోరినట్టు పోలీసులు చెప్పారు. దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది సృజన. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం సేవించిన క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు మృతి చెందినట్టు పోలీసులు స్పష్టం చేశారు. విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.