శ్రీవారి సేవలో తలైవా.. కుటుంబ సమేతంగా సుప్రభాత సేవలో

-

సూపర్ స్టార్ రజినికాంత్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నాడు. మొన్ననే రజిని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తున్నాడు.

திருப்பதி சென்ற ரஜினிகாந்த்... தேவஸ்தானம் சார்பில் சிறப்பு வரவேற்பு!!

గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం.. రజనీకాంత్‌ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, రజనీకాంత్‌ నేడు కడప అమీన్‌పీర్‌ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయనతోపాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కూడా దర్గాకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news