Jailer : ముత్తువేల్‌ పాండియన్‌ వచ్చేశాడు.. ‘జైలర్’ నుంచి వీడియో రిలీజ్‌

-

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘జైలర్’ మూవీ కోసం తలైవ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజు సంధర్భంగా ‘జైలర్’ నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామన్నారు. అన్నట్లుగానే . సాయంత్రం ‘ముత్తువేల్ పాండియన్’ వచ్చేశాడు అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘జైలర్’ నుంచి రజినీకాంత్ లుక్ ఇప్పటికే బయటకి వచ్చినా అవి ఫోటోషూట్ నుంచి రిలీజ్ చేసినవి కాబట్టి ఫాన్స్ కి అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి.

Jailer teaser: Rajinikanth as Muthuvel Pandian arrives in style. Watch  video | Entertainment News,The Indian Express

ఈసారి బర్త్ డే గిఫ్ట్ గా రజినీకాంత్ జైలర్ లుక్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తారేమోనని అండరూ అనుకున్నారు. కానీ.. వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇదిలా ఉంటే రజినీకాంత్ పుట్టిన రోజు సంధర్భంగా, ఎదో ఒక ప్రొడక్షన్ హౌజ్ నుంచి కొత్త సినిమా అప్డేట్ వస్తుంది కానీ రజినీకాంత్ కొత్త సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్ రాకపోవడం ఇదే మొదటిసారి. రజినీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నాడు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ‘పేట’ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, మురుగదాస్ లలో ఒకరితో రజినీకాంత్ తదుపరి సినిమా ఉండే అవకాశం ఉందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది కానీ ఈ ప్రాజెక్ట్స్ విషయంలో ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news