రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ కలేనా ?

రజనీకాంత్‌ మనసును ఓ నటుడు ముందే కనిపెట్టాడు. రాజకీయాల్లోకి కొంచెంసేపు వస్తావంటావు.. రానంటావు. ఇదేంటని సూపర్‌స్టార్‌ మొహం మీదే అడిగేశాడు. ఈ సీన్ అంతా రజనీ నటించిన కథానాయకుడు సినిమాలోనిది. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రారంటూ బైటకొచ్చిన లేఖ.. దీనికి సూపర్‌స్టార్‌ విశ్లేషణ చూస్తుంటే.. రజనీకాంత్‌ కొత్తపార్టీ విషయంలో డైలమాలో వున్నట్టే కనిపిస్తున్నాడు. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? రజనీకాంత్‌ ఇచ్చిన క్లారిటీ ఏంటి?

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పటికి ఇష్యూనే తెగదు ముడిపడదు.రజనీకాంత్ పేరుతో విడుదలైన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాకు కిడ్ని సమస్య ఉంది ప్రస్థుత సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారని ఇలాంటి సమయంలో పొలిటికల్ గా ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ప్రజలు,అభిమానులే నిర్ణయం తీసుకోవాలని రజనీ కోరినట్లు ఆ లేఖలో ఉంది. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీ పై మళ్లీ వివాదం రాజుకుంది.

ఈ లేఖతో రజనీ ఫ్యాన్స్ తెగ ఇదై పోయారు.వెంటనే రంగంలోకి దిగిన రజనీ కాంత్ ఆ లేఖతో తనకు సంబంధం లేదంటు ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. అయితే తనకు ఆరోగ్యసమస్యలు ఉన్నమాట వాస్తవమే అని త్వరలో రాజకీయ ప్రవేశం పై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ప్రకటించారు.ఇలా రజనీ యూటర్న్ ల పై ప్రత్యర్ధులు మాత్రం సోషల్ మిడియాలో సెటైర్లు వేస్తున్నారు.