సెగలు పుట్టిస్తున్న రకుల్ … ట్రావెల్ పీకాక్ మ్యాగజిన్లో హాట్ ఫోటో

-

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ.. ప్రత్యేక స్థానం సంపాదించింది. తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించింది. ఇటీవల కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పూర్తిగా పల్లెటూరి అమ్మాయిలా నటించి అందర్ని ఆకట్టుకుంది. అయితే తెలుగులో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకున్నా.. వార్తల్లో ఉంటుంది ఈ అమ్మడు. తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతోంది. వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే తన హాట్ ఫోటోలతో ఎప్పుడూ.. నెటిజెన్లకు, తన ఫ్యాన్స్ పండగ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తన అందాలతో ప్రేక్షకులకు పండగ చేస్తోంది. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో మరో ఫోటోను షేర్ చేసింది రకుల్ పాప. తన ఎద అందాలతో కవ్విస్తోంది. కొంటె చూపులతో కవ్విస్తోంది. ట్రావెల్ పీకాక్ మ్యాగజిన్లో రకుల్ హాట్ ఫోటో పబ్లిష్ అయింది. ఈఫోటోకు క్యాప్షన్ గా ‘‘ఏ స్టార్ అన్ బౌన్డ్ రకుల్ ప్రీత్ సింగ్’’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఫోటోను ట్విట్టర్ లో పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజెన్లు హాట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version