Ram Charan: సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్-ఉపాసన..విశేషమేంటో తెలుసా?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొప్ప మనసున్న వ్యక్తిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న వారిని, అభిమానులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నారు మెగా పవర్ స్టార్. కాగా, రామ్ చరణ్-ఉపాసన దంపతులు సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

ఇంతకీ రామ్ చరణ్ దంపతులు..ఎవరి కోసం సెలబ్రేషన్స్ చేశారంటే..ఆదివారం..రామ్ చరణ్ కారు డ్రైవర్ నరేశ్ జన్మదినం సందర్భంగా ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్-ఉపాసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేశ్ తో రామ్ చరణ్ కేక్ కట్ చేయించి, బర్త్ డే విషెస్ చెప్పారు.

తన స్టాఫ్ మెంబర్స్ తో కలిసి రామ్ చరణ్ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. ఉపాసన-రామ్ చరణ్ ఇలా చక్కగా టైం స్పెండ్ చేశారు. కాగా, తమ అభిమాన హీరో ఇలా సెలబ్రేషన్స్ లో కనిపించడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 ఫిల్మ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news