జోరు మీదున్న యంగ్ హీరో..‘స్పై’ అప్‌డేట్ ఇచ్చేసిన నిఖిల్

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రజెంట్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ఆయన ‘అర్జున్ సురవరం’ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు విడుదల కాలేదు. ఇటీవల ఆయన నటిస్తున్న ‘కార్తీకేయ -2’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, వీడియో విడుదలయ్యాయి. కాగా, తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్పై’ అప్ డేట్ ఇచ్చారు.

ఫేమస్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్పై’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 6న ఉదయం 11.11 గంటలకు ఈ ఫిల్మ్ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ట్వి్ట్టర్ వేదికగా నిఖిల్ తెలిపారు. గ్యారీ బీహెచ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఈడీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. శ్రీ చరణ్ పాకాల ఈ పిక్చర్ కు మ్యూజిక్ అందిస్తుండగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ విటేకర్ ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ ఫిల్మ్ కాగా, ఈ సినిమా దసరా పండుగ బరిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. నిఖిల్ ప్రస్తుతం ‘18 పేజిస్‌’ చిత్రంతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ‌-2’ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు సుధీర్ వ‌ర్మతో ఓ సినిమా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news