సినిమా హీరోలపైన అభిమానులకు ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిపైన తమకు ఉన్న అభిమానం చాటుకునేందుకు వారు రకరకాల పనులు చేస్తుంటారు. తమ ఫేవరెట్ హీరో ఫిల్మ్ రిలీజ్ అయితే చాలు థియేటర్స్ వద్ద హడావిడి చేస్తుంటారు. కటౌట్లు, ఫ్లె్క్సీలు, బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేయడంతో పాటు హారతులు ఇస్తుంటారు. ఇది సాధారణంగా చేసే పనే కాగా, ఓ అభిమాని తన అభిమాన కథానాయకుడిపైన ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు వినూత్న రీతిలో ప్లాన్ చేశాడు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చరణ్ పర్ఫార్మెన్స్ చూసి మెగా అభిమానులు ఆనందంతో గంతులేత్తు్స్తు్న్నారు. తమ హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, చెర్రీ ఈ నెల 27న బర్త్ డే జరపుకోనుండగా, ఆ రోజున ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఓ అభిమాని. అందులో భాగంగానే అర ఎకరం పొలంలో వరి నాటుతో చరణ్ ముఖచిత్రాన్ని తయారు చేయించాడు. దీనిని ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆవిష్కరించనున్నారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన జయరాజ్ రామ్ చరణ్ వీరాభిమాని. మెగా పవర్ స్టార్ పై ఉన్న అభిమానంతో ఆయన ఈ పని చేశాడు. పచ్చని పంట పొలాల మద్య వేసిన ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇందుకుగాను దాదాపు రెండు నెలల కిందట అర ఎకరం పొలం లీజ్ తీసుకుని రామ్ చరణ్ ముఖ చిత్రం తయారీకి పూనుకున్నట్లు జయరాజ్ పేర్కొన్నాడు. ఎంతో జాగ్రత్తగా కష్టపడి రామ్ చరణ్ ముఖ చిత్రం వచ్చేలా పొలంలో జాగ్రత్తలు తీసుకున్నామని, ఎరువులు లేజర్ వేస్తూ ఎప్పటికప్పుడు పరిశీలన చేశామని వివరించాడు. 27న మెగాస్టార్ తనయుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ శిల్పాకళా వేదికలో దీనిని ఆవిష్కరించనున్నారు. ఇకపోతే ఈ రోజున ఆర్సీ యువశక్తి ఆధ్వర్యంలో అభిమానులు స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేయనున్నారు.