రేపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా అతని తనయుడు హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగాస్టార్ చిరంజీవి కామన్ డీపీని విడుదల చేసాడు. అలాగే హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ తండ్రికి మొదటి విషెస్ చెప్పాడు చెర్రీ. ఈ డీపీలో చిరంజీవి ఐకానిక్ కారెక్టర్స్ తో పాటు అదిరిపోయే ఫోటోలు కూడా ఉన్నాయి.
Happy to be launching the Common DP to celebrate the birthday of Mega Star Chiranjeevi garu. #HBDMegastarChiranjeevi pic.twitter.com/73uk22ZPMx
— Ram Charan (@AlwaysRamCharan) August 21, 2020
ఈ డీపీలో ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ ఫోటోలో చాలా అర్థం కూడా ఉంది. ఓ కొండను తొలచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి సింహాసనంపై కూర్చున్నాడు చిరంజీవి. అంటే అతడి కష్టాన్ని ఆ ఫోటోలో చూపించారు. మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త సినిమాతో పాటు ఆచార్య అప్ డేట్స్ కూడా ఇవ్వనున్నాడు మెగాస్టార్.