ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారి మరీ..!!

రామ్ గోపాల్ వర్మ  ఇప్పటి వరకు జీనియస్ డైరెక్టర్ నుంచి ఒక పిచ్చి పట్టిన సెలబ్రిటీ గా మారాడు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతు తన ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకున్నాడు. ట్విట్టర్ లో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ మరింత దిగ జారి పోయాడు. ఈ కామెంట్స్ అన్నీ కూడా ఆయన ఒడ్కా వేసుకొని మరీ చేస్తాను అని ఆయన స్వయంగా చెప్పాడు.

ఇక తన సినిమా లను చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తాడు. ఇక దాని ప్రమోషన్ కోసం అస్సలు డబ్బులు ఖర్చు పెట్టడు. ఏదో ఒక రకంగా వివాదం రాజేసి మీడియా లో హైలెట్ అయ్యేలా చేసుకుంటూ తన సినిమా ప్రమోట్ చేస్తూ ఉంటారు.  తన `డేంజరస్‌` మూవీ ఈ నెల 9న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వర్మ ఇలా ఆషురెడ్డితో కలిసి ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్బంగా రెండు ఫోటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ ఫోటోలో వర్మ కింద కూర్చోని తన తొడల వంక చూస్తూ ఉన్నాడు. అలాగే మరో దానిలో ఆమె కాళ్ళు కూడా పట్టుకున్నాడు.ఈ రెండు ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.. నెట్టింట రచ్చ లేపుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకు పడ్డారు. ఇంతకంటే నువ్వు దిగజారి పోలేవు అని, చివరకు వాళ్ళకు థాయ్ మసాజ్ కూడా చేస్తాడు అని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు ఏమని అనుకున్నా వర్మ మాత్రం తాను అనుకున్నది సాధించాడు.