Big Breaking : మంత్రి నిరంజన్‌రెడ్డికి సైబర్‌ నేరగాళ్ల సెగ..

-

సైబర్‌ నేరగాళ్ల రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే అనుకుంటే ప్రముఖులను సైతం టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారుల, రాజకీయ ప్రముఖుల పేర్లతో నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్లు తెరిచి అందినంత దోచుకుంటున్నారు. అయితే.. తాజాగా ఈ సైబర్‌ నేరగాళ్ల సెగ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి తగిలింది. వివరాల్లోకి వెళితే.. త‌న పేరిట వ‌స్తున్న వాట్సాప్ సందేశాల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్పందించారు. కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు నకిలీ నెంబ‌ర్లు, డీపీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. నేర‌గాళ్లు డబ్బులు వ‌సూళ్లు చేస్తున్నార‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

Telangana ahead of BJP-ruled States: Niranjan Reddy

త‌న పేరిట వ‌చ్చే వాట్సాప్ సందేశాల‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ స్పందించొద్ద‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్పష్టం చేశారు. 9353849489 నంబ‌ర్ నుంచి సందేశాలు వ‌స్తే స్పందించొద్దని చెప్పారు. ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా ఆ నంబ‌ర్‌కు డ‌బ్బు పంపించొద్ద‌ని పేర్కొన్నారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు చేప‌డుతామ‌ని నిరంజ‌న్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news