‘రామబాణం’ నుంచి డైలాగ్ టీజర్!

-

అన్నదమ్ముల అనుబంధంతో మరోసారి జగపతిబాబు – గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వంలో ‘రామబాణం’.రానుంది. శ్రీవాస్ దర్శకత్వంలో గతంలో ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ సినిమాలు రూపొందాయి. ఈ రెండు సినిమాలు కూడా కామెడీ టచ్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమానే ‘రామబాణం’. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నుంచి, ‘శ్రీరామనవమి’ సందర్భంగా ఒక డైలాగ్ టీజర్ ను వదిలారు. ‘ఆ రాముడికి లక్ష్మణుడు .. హనుమంతుడు అనే ఇద్దరు ఉంటారు.

Ramabanam Special Teaser Released

ఈ రాముడికి ఆ ఇద్దరూ నేనే’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ హైలైట్. ఈ టీజర్ ను బట్టి ఈ సినిమాలో జగపతిబాబు – గోపీచంద్ అన్నదమ్ములుగా కనిపించనున్నారనే విషయం అర్థమవుతోంది. డింపుల్ హయతి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఖుష్బూ .. నాజర్ .. సచిన్ ఖేడేకర్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news