ఊరు విడిచిపెట్టిన రామన్నపల్లె గ్రామస్థులు

-

ఆధునికత పరిజ్ఞానం ఎంత పెరిగినా.. మోడ్రన్‌గా మనం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని ఆచారాలు, కట్టుబాట్లను అంత త్వరగా వదిలేయలేం. అందులో మంచి చెడు గురించి ఆలోచించకుండా వాటిని గుడ్డిగా ఫాలో అవుతుంటాం. అది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అవ్వడం వల్ల వాటిని కాదనడాని ధైర్యం సరిపోక కొందరు.. కాదంటే ఏం అపచారం జరుగుతుందోనన్న భయం మరికొందరికి. అందుకే కొన్ని కట్టుబాట్లను అలా ఫాలో అయిపోతుంటాం. అలాంటి వాటిలో ఊరు విడిచిపెట్టి పోవడం ఒకటి.

సాధారణంగా ఒక నెల రోజుల వ్యవధిలో ఒకే ఊరిలో ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది చనిపోతే కీడుగా భావిస్తారు. ఏ కారణాలతో చనిపోయినా అది మంచిది కాదనే నమ్ముతుంటారు. అదే ఊళ్లో ఉంటే ఆ కీడు తమకు, తమ కుటుంబాలకు కూడా తాకుతుందని భావించి ఊరు విడిచివెళ్తుంటారు. అలా ఊరుని విడిచి పొలాల వైపు వెళ్తారు.

కరీంనగర్‌ జిల్లా రామన్నపల్లెలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జమ్మికుంట మండలం రామన్నపల్లె వాసులు తమ గ్రామాన్ని విడిచిపెట్టారు. ఊరు విడిచి శివారు పొలాల్లో నివాసముంటున్నారు. నెలరోజుల వ్యవదిలో ముగ్గురు మృతి చెందడంతో కీడు భావించిన గ్రామస్థులు.. ఉదయమే గ్రామాన్ని విడిచిపెట్టారు. సుమారు 300 కుటుంబాలు శివారు పొలాల్లో కీడు వంటలు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news