వెండితెరపై దశాబ్దకాలం పాటు అద్భుతమైన నటన ప్రదర్శించిన వారిలో రమా ప్రభ కూడా ఒకరు.. అయితే గడిచిన కొంతకాలం నుండి ఈమె సినీరంగానికి కాస్త దూరంగా ఉంటుందని చెప్పవచ్చు.. తెలుగులో పాటుగా ఇతర భాషలలో సైతం దాదాపుగా 1850 పైగా సినిమాలలో నటించి 30కి పైగా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించింది. రమా ప్రభ ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని పరిపూర్ణ మైన జీవితాన్ని కూడా ఆస్వాదిస్తునానని తెలియజేసింది.
ప్రస్తుతం ఈమె వయస్సు 70 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఇంకా ఎంతో చలాకీగా గానే అందర్నీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటోంది రమా ప్రభ. రమా ప్రభ నటించిన కొన్ని చిత్రాలకు సంబంధించిన ప్రదేశాలను చూసేందుకు ఆమె కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో మీడియా ముందర కొద్దిసేపు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి చిలుకా గోరింక చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది రమా ప్రభ. తెలుగు ఇండస్ట్రీ లో దొరికిన పాత్రలు తనకు ఏ ఇండస్ట్రీలో కూడా లభించదని తెలియజేసింది. సినీ జీవితంలో తను ఎంతో సంతృప్తిగా ఉన్నానని తెలియజేసింది.
డైరెక్టర్ పూరిజగన్నాథ్ తన ఎప్పటికైనా రుణపడి ఉంటానని ఆయన కోరితే మాత్రమే తిరిగి ఆయన సినిమాలలో నటిస్తానని తెలియజేసింది రమాప్రభ. శబరి లాంటి పాత్రలు వస్తే చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. సినిమాలలో ఇప్పుడు ఎందుకు నటించడం లేదని ప్రశ్నించగా తాను మాత్రం సినిమాలలో నటిస్తే పాత తరం ని అవమానించినట్లే నని భావిస్తున్నట్టుగా తెలియజేసింది. వండర్ బాయ్ అనే సీరియల్ ద్వారా బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చిది. ఇక ఈమె చక్రవాకం సీరియల్ లో కూడా నటించి ప్రేక్షకాదరణ పొందింది. అయితే కొంతమంది తన బయోపిక్ తీయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని.. అయితే ఈ విషయంపై తన ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది. గతంలో సినిమాలు కేవలం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చేలా ప్రేక్షకులు ఇష్టపడేలా ఉండేవని.. ప్రస్తుతం ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది రమాప్రభ.