నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్ర పౌడెల్ ఘనవిజయం

-

రామచంద్ర పౌడెల్ నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. 214 మంది ఎంపీలు, 352 మంది శాసనసభ సభ్యులు ఆయనకు మద్దతు ఇస్తు ఓట్లు వేయడం జరిగింది. రామచంద్ర పౌడెల్ నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేత. ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పౌడెల్ నేపాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం జరిగింది. పౌడెల్ విజయం సాధించడం పట్ల నేపాలీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ బాహర్షం వ్యక్తం చేశారు. నేపాల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నా మిత్రుడు రామచంద్ర పౌడెల్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Ram Chandra Paudel win Nepal presidential elections

నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఓట్లు 882. వారిలో 332 మంది పార్లమెంటు సభ్యులు కాగా, 550 మంది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు. నేపాల్ ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి శాలిగ్రామ్ మాట్లాడుతూ… 518 మంది అసెంబ్లీ సభ్యులు, 313 మంది పార్లమెంటు సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 2008లో నేపాల్ రిపబ్లిక్ గా అవతరించాక, దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి.

 

Read more RELATED
Recommended to you

Latest news