కేవలం మన దేశమే కాకుండా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే ఐపీఎల్ కొత్త సీజన్ కు సమయం ఆసన్నమైంది. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్ కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే అన్ని జట్లు యుద్ధనికి సై అంటున్నాయి . ఏ టీం కప్పు కొడుతుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆ జోరును ఇంకా కొంత పెంచేలా స్టార్ స్పోర్ట్స్ కొత్త ఐపీఎల్ 2023 ప్రోమోను విడుదల చేయడం జరిగింది. టాటా ఐపీఎల్ కాపీ రైట్స్ దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను షూట్ చేసింది. ట్యూన్, సాంగ్ కంపోజ్ అంతా స్టార్ స్పోర్ట్స్ తీసుకుంది. అందులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అభిమానుల్తో కలిసి పాల్గొనడం జరిగింది.
ఐపీఎల్-2023 షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి మే 28 వరకు ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుంది. అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో తొలి మ్యాచు జరగనుంది. తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడతాయి. మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 జట్ల మధ్య 70 లీగ్ మ్యాచులు ఉంటాయి. చివరి లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరుగుతుంది. మే 28న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.