Ram Charan: చిరంజీవితో పని చేయడం తలుచుకుని..భావోద్వేగానికి గురైన రామ్ చరణ్

-

తండ్రీ తనయులు చిరంజీవి- రామ్ చరణ్ కలిసి నటించిన పిక్చర్ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, మెగా అభిమానులు ఈ ఈవెంట్ కు తరలివచ్చారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ తనకు తన తండ్రితో కలిసి నటించే అవకాశం ఇచ్చిన ‘ఆచార్య’ దర్శకులు కొరటాల శివకు థాంక్స్ చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి తన తండ్రి చిరంజీవి ఇలా చేయాలి, అలా చేయాలని ఏమీ చెప్పలేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే దాదాపు 20 ఏళ్ల పాటు తన తండ్రిని పొద్దున చూస్తే మళ్లీ నైట్ టైమ్స్ లోనూ చూసేవాడినని, అలాంటిది ‘ఆచార్య’ షూటింగ్ టైంలో మారేడుమిల్లిలో 20 రోజుల పాటు కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నాడు. ఈ సంగతిని తాను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటానని చెప్తూ రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు.

తను-చిరంజీవి కలిసి నటించాలన్న తన తల్లి సురేఖ కోరిక ను రాజమౌళి, కొరటాల శివ నెరవేర్చారని చెప్పుకొచ్చారు మెగా పవర్ స్టార్. కొరటాల శివ స్టోరిలు చాలా బలంగా ఉంటాయని, ఆయన రాసిన మాటలు పలికితే చాలని ఆటోమేటిక్ గా సినిమా బాగొస్తుందని చెప్పారు చెర్రీ. తన తండ్రి చిరంజీవితో కలిసి నటించడానికి తనకు 13 ఏళ్లు పట్టిందని, ‘ఆచార్య’లో ప్రతీ క్షణం తను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పారు రామ్ చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news