రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉక్రెయిన్ బాడీగార్డ్…. యుద్ధంలో ఉన్న రస్టీకి సాయం చేసిన చరణ్

-

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ట్రిపుల్ ఆర్ సమయంలో తనకు బాడీగార్డ్ గా వ్యవహరించిన ‘ రస్టీ’కి తన వంతు సాయం చేశారు.  ట్రిపుల్ ఆర్ సినిమాలు సన్నివేశాలు ఉక్రెయిన్ లో షూట్ చేశారు. నాటు నాటు సాంగ్ అక్కడే చిత్రీకరించారు. చారిత్రక భవనాలు, అందానికి మారుపేరుగా ఉండే ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యా చేస్తున్న దాడులతో అల్లాడుతోంది. చారిత్రక కట్టడాలతో పాటు పలు బిల్డింగ్ లు రష్యా చేస్తున్న దాడులతో దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న తన మాజీ బాడీగార్డ్‌ కుటుంబాన్ని ఆదుకొని పెద్ద మనస్సు చాటుకున్నాడు రామ్‌చరణ్‌ . నిత్యావసర వస్తువులను, ఇతర సామాగ్రిని కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌ నుంచి డబ్బును  పంపించారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ నాపేరు రస్టీ. ఉక్రెయిన్ నాస్వస్థంల. కీవ్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కు నేను బాడీ గార్డ్ గా పనిచేశాను. రష్యా రాకెట్ దాడులతో మేం కష్టపడుతున్నాం. యుద్ధ సమయంలో రామ్ చరణ్ నాకు లేఖ రాశారు.  హలో రస్టీ ఎలా ఉన్నారని అడిగారు. మీ కుటుంబం క్షేమంగా ఉందా అని అడిగారు. నీకు ఏ సాయం కావాలన్నా చేస్తా అని చెప్పారు. రామ్ చరణ్ నా భార్య కోసం మందులు కూడా పంపించారు. మా మాతృభూమిని కాపాడుకోవాలి. ఎంతో సాయం చేసిన రామ్ చరణ్ కు కృతజ్ఞతలు’’ అంటూ రస్టీ థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం రస్టీ కూడా తమ దేశం కోసం సైన్యంతో కలిసి పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version