శస్త్రచికిత్సల అనంతరం హ్యాపీగా ఉన్నానని వివరణ ఇచ్చిన రానా…

కేవలం ప్రతిభనే నమ్ముకుంటూ బాహుబలితో అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి. రానా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా, ఆ ఛాయలేవీ తన సినిమాలపై పడకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకున్నాడు. తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో బాబాయి వెంకటేశ్ తో కలిసి నటించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో రానా ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. తనకు కుడి కన్ను కనిపించదని, ఆ కంటికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపాడు.

Rana Daggubati quashes 'strange' rumours of his ill health

అంతేకాదు, ఓ కిడ్నీ విఫలం కావడంతో, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిగిందని వివరించాడు. ఆ లెక్కన తాను ఒక టెర్మినేటర్ నని అంటూ చమత్కరించాడు. ఓసారి ఒక పిల్లవాడు ఓ కన్ను కనిపించడంలేదని తల్లితో చెప్పి ఏడుస్తున్నాడని, దాంతో, నాకు కూడా ఒక కన్ను కనిపించదని చెప్పి ఆ చిన్నారిని ఊరడించానని రానా గుర్తుచేసుకున్నాడు. తాను ఇప్పుడు ఆనందంగా ఉన్నానని వెల్లడించాడు. శారీరక సమస్యలకు సంబంధించి నయం అయినప్పటికీ, తనకు ఎందుకిలా జరుగుతోందని ప్రతి మనిషి ఆలోచించడం సహజమని, కానీ అలాంటి వాటిని పట్టించుకోనవసరంలేదని రానా అభిప్రాయపడ్డాడు.