ప్రముఖ బాలీవుడ్ జంట రణ్‌బీర్‌కపూర్ అలియాభట్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా దేశం మొత్తం చిత్ర యూనిట్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా బ్రహ్మాస్త్ర టీం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళి దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడి నిరసనకారుల నుంచి రణ్‌బీర్-అలియా జంటకు ప్రతికూలత ఎదురయ్యింది.
గతంలో రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహాకాళేశ్వర క్షేత్రం వద్ద ఈ దంపతులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిని ఆలయంలోకి అనుమతించకూడదంటూ నిరసనలు చేపట్టారు. తీవ్రత ఎక్కువ అవుతుండటంతో స్థానిక పోలీసులు రణ్‌బీర్-అలియాజంటను అక్కడినుంచి పంపించేశారు. ఈ దంపతులు ఆలయంలో సంధ్యపూజ చేయాల్సి ఉండగా, నిరసనల కారణంగా ఆ కార్యక్రమం పూర్తి చేయకుండానే వెనుదిరిగారు.
దాదాపు పది సంవత్సరాల క్రితం రణ్‌బీర్ ఒక ప్రైవేటు వీడియోలో తనకు బీఫ్ అంటే ఇష్టమని, తరచూ తింటుంటానని వ్యాఖ్యానించాడు. అతని మాటలకు వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. అయితే బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీని ఆలయంలోకి అనుమతించడంతో అతడు మహాకాళి దర్శనం చేసుకుని, ఆ చిత్రాలను తన ఇన్‌స్టా ఖాతాలో ఉంచాడు. ‘ఎన్నో రోజుల నుంచి కాళీ మాతా దర్శనం కోసం ఎదురుచూస్తున్నా. దర్శనం అద్భుతంగా జరిగింది. మా సినిమా విడుదలవుతున్న సందర్భంగా మాపై కాళీ మాత దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ అయాన్ ముఖర్జీ ఇన్‌స్టా వేదికగా తెలిపాడు.
ఈనెల(సెప్టెంబర్) 9న ‘బ్రహ్మాస్త్ర’ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, అలియాభట్ జంటగా నటించగా, అమితాబ్ బచ్చన్, నాగర్జున కీలకపాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని దాదాపు రూ.400కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.