ఛీ.. వీళ్లు మనుషులా.. మానవత్వంలేని దుర్మార్గులు..

-

ఆన్‌లైన్‌ లోన్‌యాప్స్‌ ఏజెంట్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి, చట్టాలను అత్రికమించి లోన్‌ తీసుకున్నవారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ.. లోన్స్‌ యాప్స్‌ ఏజెంట్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.. ఖమ్మం జిల్లా మధిరలో మరో ఆన్లైన్ లోన్ యాప్ అరాచకం బయటికొచ్చింది. తీసుకున్న అప్పు మొత్తం తీర్చేసినా, లోన్ క్లియర్ కాలేదంటూ వేధింపులకు దిగారు. కేటుగాళ్లు, ఫొటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు.

Man raped two women, wife records video of incident to blackmail victims –  Live Uttar Pradesh

ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన ప్రదీప్, అత్యవసరమై, ఆన్లైన్ యాప్లో ముందు 5వేలు, ఆ తర్వాత 3500 రూపాయలు లోన్ తీసుకున్నాడు. తీసుకున్న అప్పు మొత్తం తీర్చేశాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మీ లోన్ ఇంకా క్లియర్ కాలేదంటూ పదేపదే బెదిరింపు కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రదీప్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అందరికీ ప్రదీప్.. చీటర్, రేపిస్ట్ అంటూ మెసేజ్లు పంపారు. చివరికి, ప్రదీప్ తల్లి ఫొటోను మార్పింగ్చేసి పోర్న్ సైట్ పెడతానని బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను మానసిక క్షోభకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news