నాలుగేళ్లుగా అక్కపై…తరువాత మైనర్ చెల్లిపై అత్యాచారం. వీడియో తీసి బెదిరిస్తూ దురాగతం

దేశంలో అత్యాచారాలు నానాటికి పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకువచ్చినా కామాంధులతో మార్పు రావడం లేదు. వావీవరసలు మరిచి, చిన్నాపెద్దా తారతమ్యాలు చూడటం లేదు కామాంధులు. తాజాగా ఇలాంటి అత్యాచార ఘటనే మధ్య ప్రదేశ్లో చోటు చేసుకుంది. నాలుగేళ్లుగా అక్కపై అత్యాచారం చేస్తున్న కామాంధుడు ఆమె మైనర్ చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. వివరాల్లోకి వెళ్తే… మధ్య ప్రదేశ్ జబల్ పూర్ కు చెందిన ప్రతాప్ నగరంలోని ఒక త్రీస్టార్ హోటల్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే హోటల్ లో పనిచేస్తున్న అమ్మాయితో ప్రతాప్ కు పరిచయం ఏర్పడింది. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో 2017 నుంచి సదరు అమ్మాయి హోటల్లోనే పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఒకసారి ప్రతాప్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను బాధితురాలుకు ఇచ్చాడు. మత్తులోకి వెళ్లిన తర్వాత బాధితురాలుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు తీసి, ఇంటర్నెట్ లో వైరల్ చేస్తా అని చెబుతూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

అత్యాచారం

ఈక్రమంలోనే బాధితురాలి చెల్లి తరుచుగా అక్కను కలిసేందుకు హోటల్ కు వస్తుండేది. దీంతో ప్రతాప్ కన్ను మైనర్ చెల్లిపై పడింది. ఇటీవల ఒక రోజు అక్కాచెల్లెళ్లతో కలిసి కారులో బయటకు వెళ్లిన ప్రతాప్, మళ్లీ కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి అక్కా చెల్లెళ్లకు ఇచ్చాడు. మత్తులోకి జారుకున్నతరువాత మైనరైన బాధితురాలి చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన దుర్మార్గాన్ని వీడియో తీశాడు. మెలుకువలోకి వచ్చిన తర్వాత జరిగిన అత్యాచారాన్ని తలుచుకుని అక్కాచెల్లిళ్లు ఏడ్చారు. వీడియోను చూపిస్తూ మరోసారి బాధితురాలి చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అయితే తనకు అన్యాయం జరిగిన సహించిన సదురు బాధితురాలు, చెల్లెలి విషయంలో మాత్రం సహించలేకపోయింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రతాప్ పై ఫిర్యాదు చేసింది. పోలీసులు రెండు వేరువేరు అత్యాచార కేసులతో పాటు, ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.