‘డ్రగ్’ పాలిటిక్స్: జగన్‌ని టార్గెట్ చేసిన పవన్… మధ్యలో ఇరుక్కున బాబు..

-

ఏపీలో డ్రగ్స్, గంజాయి అంశంపై దుమారం చెలరేగుతూనే ఉంది. మొన్నటివరకు ఈ అంశంపై ప్రతిపక్ష తెదేపా..అధికార వైకాపాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చింది. అసలు డ్రగ్స్, గంజాయి అడ్డాగా ఏపీ మారిపోయిందని ఆరోపణలు చేశారు. ఆరోపణలకు తగ్గట్టుగానే గంజాయి, డ్రగ్స్ అంశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ వైపే చూపిస్తున్నాయి. అయితే ఇదే అంశంపై తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ…జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని తిట్టడంతో టాపిక్ డైవర్ట్ అయింది. ఆ తర్వాత తెదేపా ఆఫీసులపై వైకాపా శ్రేణుల దాడులతో రాజకీయం మారింది. దీని వల్ల డ్రగ్స్, గంజాయి అంశం పక్కదారి పట్టింది.

pawan kalyan ys jagan

కానీ ఈ అంశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వదల్లేదు…. దీనిపై సోషల్ మీడియా వేదికగా వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏపీలో గంజాయి గురించి ఇటీవల నల్గొండ ఎస్పీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లు మాట్లాడిన వీడియోలని సోషల్ మీడియాలో పెట్టారు. ఏపీకి సంబంధించిన వ్యక్తులని సైతం అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశంతో ఏపీలో గంజాయి సాగు ఏ విధంగా జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.

ఇదే అంశాన్ని పవన్ హైలైట్ చేయాలని అనుకున్నారు.. ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారిందని, ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయిందని, ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోందని, ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని తెలంగాణ పోలీసులు మాట్లాడిన మాటలు బట్టి అర్ధమవుతుందని పవన్ చెప్పుకొచ్చారు.

ఇక పవన్…జగన్‌ని టార్గెట్ చేస్తూనే అదే చేత్తో చంద్రబాబుని కూడా ఇరికించారని చెప్పాలి. 2018లో తన పోరాట యాత్ర సందర్భంగా ఏపీ, ఒరిస్సా సరిహద్దులో గిరిజన గ్రామాలలో పర్యటించానని, అక్కడ ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, అలాగే గంజాయి వ్యాపారం అక్కడ మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. 2018 అంటే చంద్రబాబు అధికారంలో ఉండగా…అంటే అప్పుడు గంజాయి వ్యాపారం జరిగిందనే విషయం కూడా పవన్ హైలైట్ చేశారు…మొత్తానికి జగన్‌ని టార్గెట్ చేసిన పవన్…బాబుని కూడా ఇరికించారు.

Read more RELATED
Recommended to you

Latest news