ఏ మార్గంలోనైనా అవకాశం దొరికితే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. నగర ప్రజలు అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు కొత్త కొత్త ఆలోచనలకు పునాదులు వేస్తూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. ఆ ఉపాధిలో కూడా కామాన్ని వెతుక్కుంటున్నారు.. కక్కుర్తి కామాంధులు.. నిత్యం హైదరాబాద్ నగరంలో ర్యాపిడో సేవలు ఎంతో మంది ఉపయోగించుకుంటున్నారు. అందులో అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే.. రైడ్ బుక్ చేసినప్పుడు అమ్మాయిల నెంబర్‌ను సేవ్ చేసుకొని ఓ దుర్మార్గుడు.. ఆమ్మాయిలకు అర్థనగ్న ఫోటోల పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు.
దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు అర్ధనగ్న ఫొటోలు పంపి వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి షీ టీమ్కు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. విజయ్ కుమార్ అనే ర్యాపిడో
డ్రైవర్ అమ్మాయిల నెంబర్లు సేకరించి ఇలా హాఫ్ న్యూడ్ ఫొటోలు పంపుతున్నట్టు గుర్తించారు. కామవాంఛాతోనే
వేధిస్తున్నట్టు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మరొకరు కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.