అతని వల్లే కాబోయే భర్తను దూరం చేసుకున్న రష్మిక..!!

-

రష్మిక మందన్న.. పెద్దగా పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఛలో సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ గీతాగోవిందం సినిమాతో ఓవర్ నైట్ లోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్న రష్మిక ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారి..ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో డీ గ్లామర్ పాత్ర పోషించి నేషనల్ హీరోయిన్ గా గుర్తింప తెచ్చుకోవడం గమనార్హం.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలలో కూడా నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. రష్మిక సినీ కెరియర్ విషయానికి వస్తే జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నప్పటికీ ఆమె వ్యక్తిగత విషయంలో ఎప్పటికప్పుడు రూమర్స్ బాగా వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే . మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే రష్మిక మందన్న తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే కన్నడలో తను మొదట నటించిన కిరాక్ పార్టీ సినిమా హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది.
కానీ వీరిద్దరూ వివాహం చేసుకుంటారు అని అనుకునే లోపే తమ నిశ్చితార్థానికి బ్రేకప్ చెప్పడం జరిగింది. అయితే ఒక వ్యక్తి కారణంగా తన కాబోయే భర్తను రష్మిక దూరం చేసుకోవడం చాలా విషాదకరమని చెప్పాలి. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి..

ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రష్మిక కెరియర్ గురించి , ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.వేణు స్వామి మాట్లాడుతూ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం ఖాయమైన సమయంలో ఇద్దరి జాతకాలు చూశాను అప్పుడే వీరిద్దరి పెళ్లి జరగదని తెలిసిపోయింది. ఇదే విషయాన్ని రష్మిక తో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాను. ఇద్దరి జాతకాలు కలవలేదు అని , ఒకవేళ పెళ్లి జరిగినా ఇద్దరి లైఫ్ స్టైల్ భిన్నంగా ఉండడం కారణంగా వీరు విడాకులు తీసుకుంటారని చెప్పానని వేణు స్వామి తెలిపారు. ఇక అందుకే రష్మిక తన కాబోయే భర్త రక్షిత్ శెట్టి ని దూరం చేసుకుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news