అక్కడ చికెన్‌ కంటే ఎలుకల మాంసమే కాస్ట్‌ ఎక్కవ.. పెళ్లికి కట్నంగా కూడా ఎలుకలే..!!

-

చాలామంది ఇళ్లలో ఎలుకల తెగ ఇబ్బందిపెడతాయి.. నైట్‌ వంటగదిలో లైట్‌ ఆపేసి వచ్చి పడుకుంటే.. ఇక అప్పుడు వాటి దందా స్టాట్‌ చేస్తాయి.. ఏ డబ్బాల్లో ఏమున్నాయి..? ఏం తిందామా అని అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. మన సైడ్‌ ఎలుకలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎక్కువగా ఉంటే.. మందు పెట్టి చంపేస్తాం.. అయితే కొన్ని ఏరియాల్లో ఎలుకలను పూజించే వాళ్లు కూడా ఉన్నారు.. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకా వెరైటీ.. ఇక్కడ చికెన్‌ కంటే.. ఎలుకల మాంసమే కాస్ట్‌ ఎక్కువట.. అంత ఇష్టంగా తింటారు వాళ్లు.. ఛీ అనుకుంటున్నారా..? కూతురి పెళ్లికి కట్నంగా ఎలుకలు కూడా ఇస్తారట..! ఈశాన్య భారత్‌లోని మారుమాలు ఓ గ్రామం ఉంది.. వాళ్లు ఎలుకలను ఎగబడి మరీ తింటారు.. వారి గురించి ఇంట్రస్టింగ్‌ స్టోరీ మీకోసం..!!
ఏటా మార్చి 7న ఈశాన్య భారత్‌లోని ఒక మారుమూల గ్రామంలో ‘‘యూనంగ్ ఆరాన్’’ పేరుతో ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఇది అద్భుతమైన వేడుక. తమ ఇంటికి వచ్చే అతిథులకు ఇక్కడ ఆహారంగా ఎలుకలను వండి పెడతారట.. ఇక్కడి గిరిజనులు ‘‘బోలె బలాక్ ఉయింగ్’’ పేరుతో ఒక వంటకం చేస్తారు. ఎలుక కడుపు, పేగులు, కాలేయం, వృషణాలు, కాళ్లు, తోకకు ఉప్పు, కారం, అల్లం కలిపి దీన్ని తయారుచేస్తారు. ఇక్కడి గిరిజనులు అన్ని రకాల ఎలుకలనూ ఆహారంగా తీసుకుంటారు. మన ఇళ్లలో కనిపించే ఎలుకలతో మొదలుపెట్టి అడవి ఎలుకల వరకు అన్నింటినీ తింటారట..
ఎలుకలను ఆహారంగా తీసుకునే వారిపై రీసర్చ్‌..
ఎలుక తోక, కాళ్లు చాలా రుచికరంగా ఉంటాయని ఫిన్లాండ్‌లోని ఓలో యూనివర్సిటీకి చెందిన విక్టర్ బెన్నో మేయర్ తెలిపారు. తన పరిశోధనలో భాగంగా ఆయన చాలా మంది గిరిజనులతో మాట్లాడారు. ఆ పరిశోధనలో విక్టర్ చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు. ‘‘అన్ని మాంసాల కంటే ఎలుక మాంసమే బావుంటుంది’’అని ఆయనతో కొందరు గిరిజనులు చెప్పారట. మనం ఎలా అయితే చికెన్‌, మటన్‌ వండుకుంటామో.. ఇక్కడి వాళ్లు ఎలాంటి సందర్భంలో అయినా ఈ వంటకం చేసుకుంటారు.. ప్రత్యేకంగా పార్టీలు, వేడుకలే ఉండనక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మాంసం వండుకుంటామని గిరిజనులు తెలిపారు.. ఇంటికి వచ్చే అతిథులకు విందుగా దీన్ని వడ్డిస్తామని ఆయనతో గిరిజనులు చెప్పారు.
బహుమతిగా కూడా…
ఆ గిరిజనుల ఆహారంలో మాత్రమే ఎలుకలు భాగం కాదు, వీటిని బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఇక్కడ కొంత మంది పెళ్లిళ్లలో ఎలుకలను కట్నంగా ఇస్తారు. పెళ్లి కూతురిని అత్తారింటికి పంపేటప్పుడు ఆమెకు ఎలుకలను కూడా ఇస్తుంటారట. భలే ఆశ్చర్యంగా ఉంది కదూ..!! ‘‘యూనంగ్ ఆరాన్’’ రోజున పిల్లలకు కూడా ఎలుకలను బహుమతిగా ఇస్తారు. కిస్మస్ రోజు పిల్లలకు బహుమతులు ఇచ్చినట్లే ఎలుకలను వారికి ఇస్తారు. బొమ్మలతో ఆడుకున్నట్లుగా వారు ఎలుకలతో ఆడుకుంటారట..
జింకలు, మేకలకంటే..ఎలుకలే ఇష్టమట..
అసలు మూలవాసులకు ఎలుకలపై ఇంత ప్రేమ ఎలా పెరిగిందో పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే, వీటిని ఎప్పటినుంచో సంప్రదాయంగా వీరు ఆహారంగా తీసుకుంటున్నారు. అడవుల్లో జింకలు, మేకలు, ఎద్దులు.. ఇలా చాలా జంతువులు తిరుగుతుంటాయి. కానీ, వారికి ఎలుకలు అంటేనే ఎక్కువ ఇష్టంమట…
నిజానికి విక్టర్ శాకాహారి. అయితే, రుచి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఎలుక మాంసాన్ని ఆయన తిన్నారు. వాసన పక్కనపెడితే, దీని రుచి ఇతర మాంసాల్లానే ఉందని..ఆయన చెప్పారు. ఎలుకలను ఆహారంగా తీసుకోవడం అనేది భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అసాధారణ ఆహారాలను తీసుకుంటున్న కొంత మందితో బ్రిటిష్ టీవీ హోస్ట్ స్టీఫెన్ గేట్స్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేశారు. దీనిలో భాగంగానే కామెరూన్‌లోని యావుండే సివార్లలో ఒక చిన్న ఎలుకల పెంపక కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ ఎలుకలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇక్కడి కోడి మాంసం, కూరగాయల కంటే ఇవి ఖరీదు కూడా చాలా ఎక్కువ అని గేట్స్ చెప్పారు.

ఎందుకంతా టేస్ట్..?

వీటి రుచి ఎలా ఉందని అక్కడి ప్రజలు అడిగినప్పుడు.. నేను తిన్న మాంసాల్లో ఇదే అత్యంత రుచికరమైనదని గేట్స్ చెప్పారు. అక్కడ ఎలుక మాంసాన్ని టమాటోలతో కలిపి వండుతారు. బాగా రుచికరమైన మాంసం, కొవ్వు నిండిన గ్రేవీతో నోటిలో వేసుకోగానే కరిగిపోయినట్లు అనిపిస్తుందట.

బిహార్‌లోనూ..

బిహార్‌లోని కొన్ని దళిత వర్గాలనూ గేట్స్ కలిశారు. వారు ఇక్కడి భూసాముల పొలాల్లో పనిచేస్తుంటారు. ఇక్కడి పొలాలకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని పట్టుకొని ఆహారంగా తినేందుకు దళితులకు ఉన్నత వర్గాల ప్రజలు అనుమతించారట. చిన్నచిన్న ఎలుకల మాంసాం చాలా మెత్తగా, మృదువుగా ఉంటుంది. దీన్ని కోడి మాంసంలా ట్రీట్‌ చేస్తారట..అయితే ఇక్కడ ఎలుకల వెంట్రుకలతోనే అసలు ఇబ్బంది. ఎలుకల మాంసం లేదా కొవ్వు పాడు కాకుండా ఉండేందుకు వీటిని నిప్పుల్లో పెట్టి కాలుస్తారు. దీని వల్ల విపరీతమైన వాసన వస్తుంది. అది భరించడం కొత్తవాళ్లకు చాలా కష్టమట.. కానీ, లోపల మాంసం మాత్రం బావుంటుంది’’ అని గేట్స్ చెప్పారు.

 ఈ దేశాల్లో కూడా..

ఎలుకలను తినే సంప్రదాయం ఈనాటిది కాదు. నెబ్రాస్కా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. చైనాలో టాంగ్ సామ్రాజ్యం (618-907) కాలం నుంచీ ఎలుకలను ఆహారంగా తీసుకునేందుకు పెంచుకునేవారు. చిన్నచిన్న ఎలుకలను తేనెలో కలిపి టాంగ్ సామ్రాజ్యంలో ఆహారంగా తీసుకునేవారని ఆ అధ్యయనం తెలిపింది. మరోవైపు 200 ఏళ్ల ముందు వరకు న్యూజీలాండ్‌లో చాలా మంది ఇంటిలో తిరిగే ‘‘క్యోరే’’గా పిలిచే ఎలుకలను తినేవారు. ఈ ఎలుకల మాంసాన్ని ఇక్కడ పర్యటకులకు ఆహారంగా పెట్టేవారు. పెళ్లిళ్ల సమయంలో వీటిని కుటుంబాలు ఇచ్చిపుచ్చుకునేవి. కంబోడియా, ఇండోనేసియా, థాయిలాండ్, ఘానా, చైనా, వియత్నాంలలోని కొన్ని ప్రాంతాల్లో ఎలుకలను ఆహారంగా తీసుకుంటారని ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు గ్రాంట్ సింగెల్‌టన్ చెప్పారు.

ఎలుకల్లో రకాలు.. వాటి రుచి..

వియత్నాంలోని మెకాంగ్ డెల్టా ప్రాంతంలో తను ఆరుసార్లు ఎలుక మాంసం తిన్నట్లు సింగెల్‌టన్ చెప్పారు. రుచి విషయానికి వస్తే.. ‘‘అన్నంతో కలిపి ఈ మాంసాన్ని తింటే.. కుందేలును తిన్నట్లే అనిపిస్తుందట.
లావోస్‌, మియన్మార్‌లలోనూ ఎలుకలను ఆయన ఆహారంగా తీసుకున్నారు. లావోస్‌లోని ఉత్తర ప్రాంతాల్లో దాదాపు ఐదు రకాల ఎలుకలను ఆహారంగా తీసుకోవడాన్ని ఆయన చూశారు.
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు ఎలుకలను ఆహారంగా తీసుకుంటారు. ఉదాహరణగా నైజీరియా.. ఇక్కడ పెద్ద ఎలుకలను ప్రజలు ఇష్టంగా తీసుకుంటారు.
గోమాంసం, చేపల కంటే ఇక్కడ ఎలుక మాంసం ధర ఎక్కువని నైజీరియా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన మోజిసోలా ఓయారిక్వా చెప్పారు. వాటిని వేపుకోవచ్చు. కాల్చుకోవచ్చు. ఉడకబెట్టి తినొచ్చని ఆయన చెప్పారు.
అయితే వేరే ఆహారం లేక తప్పక వీటిని తింటున్నారేమో అని డౌట్‌ రావొచ్చు. అలా ఏం లేదు. వీళ్లుకు తినేందుకు చాలా రకాలు ఉన్నా..ఎలుకలనే ఇష్టంగా తింటున్నారు.. కొన్నాళ్లు అయితే మెనూ కార్డులో ఈ ఎలుకలకు సంబంధించిన రెసిపీస్‌ ఉంటాయోమో! ఎలుకలకు మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వాటిమీద చేసిన ప్రయోగాలు మనిషికి వర్తిస్తాయి.. అందుకే ఏదైనా డ్రగ్‌ మొదట ఎలుకల మీద చేసే రిజల్ట్‌ ఓకే అయితేనే మార్కెట్‌లోకి వస్తుంది. ఎలుకల మాంస తినడం ఆరోగ్యానికి హానికరం అని కానీ, వాటిని తినడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి అని కానీ అధ్యయనం చేసిన వాళ్లు చెప్పలేదు. మనకు ఇది కొత్తగా అనిపిస్తుంది.. వాళ్లు మాత్రం చికెన్‌, మటన్‌లానే ట్రీట్‌ చేస్తున్నారు..!!

Read more RELATED
Recommended to you

Latest news