తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయి – సజ్జల

-

చంద్రబాబుది మొదట్నుంచీ రెండు నాల్కల ధోరణేనని… తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సజ్జల. చంద్రబాబు ఏపీ వాడు కాదు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తెలంగాణలోనే ఉన్నాయని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని.. సీఎం వైఎస్ జగన్‌కు ఏపీలోనే ఉండాలనే విషయమై స్పష్టత ఉందని పేర్కొన్నారు.

చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియడం లేదని.. తెలంగాణలో ప్రజలకు సేవ చెయ్యాలి అంటే మంచిది ఏపీలో కూడా చేస్తామంటే ఇంకా మంచిదని వివరించారు. రాజకీయాలు అంటే చంద్రబాబుకు ఆట అని..ఇప్పుడు ఎన్నికలు కాబట్టి తెలంగాణకు వెళ్ళాడని ఆగ్రహించారు.ఏమి చెయ్యాలో చంద్రబాబుకు స్పష్టత లేదని…రాష్ట్రం అన్యాయంగా విడిపోయింది సేవ చేయాలి అనే క్లారిటీ జగన్‌కు ఉందని వెల్లడించారు. నాతో పెట్టుకుంటే తెలంగాణలో ఉపయోగం ఉంటుందని బీజేపీకి చెప్పడమే బాబు ఉద్దేశమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news