బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకున్న ధమాకా..!

-

రవితేజ – నక్కిన త్రినాథరావు కాంబినేషన్లో ‘ధమాకా’ సినిమా తెరకెక్కింది. ఈ నెల 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్‌ టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజునే 10 కోట్లకి పైగా గ్రాస్ ను చూసిన ఈ సినిమా, రెండో రోజున 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా రోజుకి 10 కోట్ల చొప్పున వసూళ్లను రాబడుతూ 5 వ రోజుకి 49 కోట్లను రాబట్టి, 50 కోట్ల మార్కును టచ్ చేయడానికి రెడీగా ఉంది. రవితేజ కెరీర్‌లో అత్యంత వేగంగా 40కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా ధమాకా రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక క్రాక్‌ తర్వా త మళ్లీ ఆ రేంజ్‌ పర్‌ఫార్మెన్స్‌తో అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్‌ చేశాడు.

Jinthaak': First lyric video from Ravi Teja, Sreeleela's 'Dhamaka' to  release on this date | Telugu Movie News - Times of India

కాగా తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ పూర్తి చేసుకుంది. రూ.18కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా షేర్‌ సాధించి బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతుంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారంలో వంద కోట్ల గ్రాస్‌ మార్కును కూడా టచ్‌ అయ్య చాన్స్‌ ఉంది. పైగా ఈ సినిమాతో పాటు రిలీజైన్ నిఖిల్‌ 18పేజీస్‌, విశాల్‌ లాఠీ, నయనతార కనెక్ట్ సినిమాలు డివైడ్‌ టాక్‌ తెచ్చుకుని ఫ్లాప్‌ల దిశగా సాగుతున్నాయి. అంతేకాకుండా వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్‌ కావడం లేదు. దాంతో ధమాకా మూవీ ఫుల్‌ రన్‌లో మంచి కలెక్షన్‌లు సాధించే చాన్స్‌ ఉంటుంది.

అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా, అభిషేక్‌ అగర్వాల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రవితేజకు జోడీగా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల నటించింది. రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ డిజాస్టర్‌ల తర్వాత ఒక బ్లాక్‌ బస్టర్ హిట్టు రావడంతో అటు రవితేజ, ఇటు ఆయన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news