4 ఏళ్లుగా విద్యార్థినిపై సైన్స్ టీచర్ అత్యాచారం..ఫోన్లో రికార్డు చేసి మరీ

-

దేశంలో మహిళలపై దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు మహిళలపై దాడులు పెరగడమే తప్ప… తగ్గడం లేదు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహమదాబాద్ ఇంజనీరింగ్ కోర్సులు బోధించే ప్రఖ్యాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క బ్రాంచ్ లో మయాంక్ దీక్షిత్ అనే వ్యక్తి సైన్స్ టీచర్ గా అలాగే మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తున్నాడు. అయితే 2016 సంవత్సరంలో మయాంక్ దీక్షిత్ పనిచేసే ఇనిస్టిట్యూట్ లో 16 సంవత్సరాల యువతి కోచింగ్ కోసం జాయిన్ అయింది. అయితే అప్పుడే మయాంక్ కన్ను ఆ యువతి పై పడింది.

రోజు క్లాస్ అయిపోయిన తర్వాత నీతో మాట్లాడాలి అంటూ అదనపు సమయం ఇచ్చేవాడు. మాయమాటలు చెప్పి ఓసారి ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. మొట్టమొదటిసారిగా ఆ యువతిపై అప్పుడే మయాంక్ దీక్షిత్.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నువ్వు వీడియో రికార్డ్ చేసి… తన లైంగిక వాంఛను తీర్చాలని తరచూ ఆ యువతిని వేధించే వాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించే వాడు. ఇలా అప్పటినుంచి ఆ యువతిపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నాడు దీక్షిత్. అయితే తాజాగా… ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… అతన్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news