IPL RCB vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ.. మొద‌ట బ్యాటింగ్ బెంగ‌ళూర్

-

ఐపీఎల్ 2022 లో నేడు డ‌బుల్ ధ‌మాకా ఉన్న విషయంలో తెలిసిందే. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. కాగ ప్ర‌స్తుతం రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ మ‌ధ్య జ‌రుగుతుంది. ముంబైలోని వాంఖ‌డే స్లేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో కీల‌క‌మైన టాస్ ను ఢిల్లీ క్యాపిటిల్స్ గెలిచింది. దీంతో కెప్టెన్ రిషబ్ పంత్ మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు.

డు ప్లెసిస్ సార‌థ్యంలో ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. బెంగ‌ళూర్ కు జ‌ట్టులోకి హ‌ర్షల్ ప‌టేల్ వ‌చ్చాడు. అలాగే ఢిల్లీ తుది జ‌ట్టులోకి మిచెల్ మార్ష్ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు :
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు :
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ / వికెట్ కీప‌ర్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news