రియ‌ల్‌మి నుంచి 3 కొత్త ఫోన్లు.. ధ‌ర త‌క్కువ‌.. ఫీచర్లు అదుర్స్‌..

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి భార‌త్‌లో కొత్త‌గా 3 స్మార్ట్ ఫోన్ల‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది. రియ‌ల్‌మి నార్జో 20 ప్రొ, నార్జో 20, నార్జో 20ఎ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్ల ధ‌ర‌లు కూడా చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

realme launched narzo 20 pro and narzo 20 and narzo 20a smart phones

రియ‌ల్‌మి నార్జో 20 ప్రొ స్పెసిఫికేషన్లు…

* 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్ల‌స్ ప్రొటెక్ష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి నార్జో 20 ప్రొ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999గా ఉంది. సెప్టెంబర్ 25 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తారు.

రియ‌ల్‌మి నార్జో 20 స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెస‌ర్
* 4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 48, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి నార్జో 20 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,499 ఉండ‌గా, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.11,499గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబ‌ర్ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో విక్రయిస్తారు.

రియ‌ల్‌మి నార్జో 20ఎ స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్‌
* 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 12, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి నార్జో 20ఎ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.8,499 ఉండ‌గా.. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.9,499గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను ఈ నెల 30వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news