ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం టీడీపీదే : యనమల

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి లో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు యనమల. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూగో జిల్లా లో ప్రత్తిపాడు నియోజక వర్గం టీడీపీ కీ బలమైన నియోజక వర్గమన్నారు యనమల.

yanamala ramakrishnudu

ఈ నియోకవర్గానికి వరుపుల రాజా బలమైన నాయకుడు, ఉత్సాహ వంతడు అని కొనియాడారు. రాజా పనితీరు గత మున్సిపల్ ఎన్నికలలో చూసామని గుర్తు చేశారు. నవ రత్నాలు పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని యనమల ఫైర్‌ అయ్యారు. టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైఎస్సార్సీపీ చేసిన మరో అభివృద్ది కార్యక్రమం ఏదీ కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల భారం ప్రజల పైనే పడుతుందని… హద్దులు దాటి అప్పులు చేస్తున్న ముఖ్యమంత్రి అప్పులు తీర్చే పరిస్థితులు కన్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రం అంధకారం లోకి ముంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అని నిప్పులు చెరిగారు.