ఫ్యాక్ట్ చెక్: 5G, 4G టవర్స్‌ ని మీ స్థలంలో పెడతామంటూ మెసేజ్ వచ్చిందా..? అయితే నిజమేంటో తెలుసుకోండి..!

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు ఎక్కువై పోతున్నాయి. ఆన్లైన్ ద్వారా మోసాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వీటి వల్ల మనం కూడా నష్ట పోవాల్సి వస్తుంది. తాజాగా 5జీ, 4జీ టవర్స్ కి సంబంధించిన వార్త ఎక్కువగా వినపడుతోంది. ఈ టవర్స్ ని ఇన్స్టాలేషన్ చేస్తామంటూ సెల్ ఫోన్ కి మెసేజ్ పంపుతున్నారు.

దీని కోసం మీరు కొంత డబ్బు చెల్లిస్తే నెల నెలా అద్దె రూపంలో చెల్లిస్తామని మెయిల్స్ కూడా వస్తున్నాయి. మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీకూ ఇలా మెసేజ్ వచ్చిందా..?దీన్ని నమ్మొచ్చా అనేది చూస్తే… ఇలాంటి మెసేజ్లు లింకులపై క్లిక్ చేస్తే మోసపోవాల్సి వస్తుంది.

అయితే దీని పై పీఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇలాంటి వాటిని నమ్మవద్దని ఇటువంటి వాటి ద్వారా మోసాలు చేస్తున్నారని తెలిపింది. కొంతమంది మోసగాళ్ళు కంపెనీలు, ఏజెన్సీలు పేర్లతో సామాన్య ప్రజల్ని మోసం చేస్తున్నారు. అయితే ఇలా వచ్చే మెసేజ్లు ఏ మాత్రం నమ్మకండి.

మొబైల్ టవర్ ను ఇన్స్టాల్ చేయడానికి అద్దెకు ఇవ్వడం లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనదు అని గమనించాలి. ఇలాంటి మెసేజ్ వస్తే లైట్ తీసుకోండి అంతే కానీ ఈ లింక్ మీద క్లిక్ చేసి అనవసరంగా ఇబ్బంది పడకండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version