మహిళా అభ్యర్థులకు గుడ్​న్యూస్.. గురుకుల పోస్టుల్లో 80% వారికే

-

తెలంగాణ మహిళా అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మొత్తం 2,876 పోస్టుల భర్తీకి వెలువరించిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికి దఖలుపడ్డాయి. అలానే జనరల్‌ కింద పేర్కొన్న మిగిలిన పోస్టులకు పురుషులతో పాటు మహిళలూ పోటీపడవచ్చు.

గురుకులాల నిబంధనల మేరకు మహిళా విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళలే అర్హులు కావడంతో వారికి అదనపు ప్రయోజనం లభిస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ మహిళలవే కావడం గమనార్హం. ఈ విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక రోస్టర్‌ను అమలు చేయనున్నారు.

రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జూనియర్‌ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news