రెడ్డివారి నానుబాలు మొక్క.. షుగర్‌కు చక్కని పరిష్కారం..!!

-

ప్రకృతిని మించిన ఔషధం ఇంకోటి ఉండదు. సమస్యలు ఇచ్చిన దేవుడే వాటికి పరిష్కారం కూడా ఇస్తాడన్నట్లు.. మనకు వచ్చే రోగాలకు మెడిసిన్స్‌ను ప్రకృతే అందిస్తుంది. ఆ విషయం మనకు తెలియక ఇంగ్లీష్‌ మందులపై ఆధారపడతున్నాం.. ఎలాంటి మందులు లేనప్పుడే.. మన పూర్వీకులు ఎన్నో రోగాలకు ఆయుర్వేదం సాయంతో నయం చేశారు. మనం రోజు ఎన్నో మొక్కలను చూసే ఉంటాం.. కానీ వాటి పేరు, వాటి విలువ తెలియక లైట్‌ తీసుకుంటాం.. అలా మనం లైట్‌ తీసుకున్న మొక్కల్లో ఇది కూడా ఒకటి.. రెడ్డి వారి నానుబాలు మొక్క..
ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క‌ను అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించడంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ రెడ్డి వారి నానుబాలు మొక్క‌ను సంస్కృతంలో దుక్దిక అని హిందీలో దూక్ దీ అని పిలుస్తారు. అలాగే దీనికి నాగార్జుని, ప‌చ్చ బొట్లాకు, పాల‌కాడ‌, గొర్రెకాడ అని కూడా అంటారు.. ఈ మొక్క ఎరుపు, తెలుపు రంగుల్లో రెండు ర‌కాలుగా ల‌భ్య‌మ‌వుతాయి. ఒక అడుగు పెరిగే పెద్ద రెడ్డి వారి నానుబాలు కంటే చిన్న ఆకుల‌తో ఉండే చిన్న రెడ్డి వారి నానుబాలు మొక్క‌లోనే ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి.
పూర్వకాలంలో ఈ మొక్క ఆకుల‌ను దంచి దాని నుండి తీసిన ర‌సంతో ప‌చ్చ‌బొట్ల‌ను పొడిచే వారు. దీంతో ఈ మొక్క‌కు ప‌చ్చ బొట్లాకు అనే పేరు వ‌చ్చింది. ఈ మొక్క తీపి, కారం, చేదుగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేదా ఆకుల క‌షాయాన్ని ప‌రిమిత మోతాదులో తీసుకుంటే మేహ రోగాలు, ప్రేగుల్లో పుట్టే క్రిమి రోగాలు, విష రోగాలు, నేత్ర రోగాలు, కంఠ రోగాలు, చ‌ర్మ రోగాలు, సెగ రోగాలు స‌మూలంగా నివారించ‌బ‌డ‌తాయి. రెడ్డి వారి నానుబాలు మొక్క ఆకుల‌ను ప‌ప్పులో వేసుకుని తింటే బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి.
మ‌ధుమేహం కార‌ణంగా కంటి సమస్యలు, మూత్ర రోగాలు, న‌రాల బ‌ల‌హీన‌త వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. అలాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఈ మొక్క దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. ఈ మొక్క‌ను స‌మూలంగా సేక‌రించి ముక్క‌లు ముక్క‌లు చేసి ఎండ‌బెట్టాలి. త‌రువాత వీటిని మెత్త‌గా దంచి జ‌ల్లించగా వ‌చ్చిన పొడిని నిల్వ చేసుకోవాలి.
ఈ పొడిని రోజూ రెండు పూట‌లా అర టీ స్పూన్ మోతాదులో అర క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. న‌రాల‌కు బ‌లం క‌లుగుతుంది.
ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే చాలా మంది శ‌రీరంలో క‌ణ‌తులు, సెగ‌డ్డ‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ రెడ్డి వారి నానుబాలు మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
ఇది ఎక్కడో అడవుల్లో ఉండదు.. మన ఇంటి చుట్టు పక్కలే ఉంటుంది. బాగా మొక్కలు పెరిగే ఏరియాల్లో ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయో మీకు ఐడియా ఉంటే చాలు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version