అనంతపురం : కొత్త జిల్లాల పునర్విభజన పై ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ కీలక ప్రకటన చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయిందని.. మార్చి 3 వ తేదీ దాకా అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్.
కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని.. కానీ ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు.
రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు అందాయని.. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలు అవుతుందని ప్రకటన చేశారు ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్. దీనిపై ఎవరికి ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.