తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా RRRకు నిధులు విడుదల కానున్నాయి. రీజినల్ రింగ్ రోడ్(RRR) ఉత్తరభాగం భూసేకరణ వ్యయంలో తన వాటాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
344KM మేర నిర్మించనుండగా, ఇందుకోసం తొలిదశలో 158.60KM మేర నిర్మాణానికి 4760 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు రూ. 2200 కోట్లు అవుతుందని అంచనా ఉండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, NHAI భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తుంది.