హోం మంత్రి మనుమడే రేప్ కేసులో ఉన్నాడు – రేణుకా చౌదరి

-

హోం మంత్రి మనుమడే రేప్ కేసులో ఉన్నాడని ఆరోపించారు రేణుకా చౌదరి. మైనర్ లకు పబ్బుల్లో అనుమతి ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. దాని మీద కూడా విచారణ జరపాలి..అన్నీ దేశాల కల్చర్ తేవడం కాదు.. అమ్మాయిలకు రక్షణ ఇవ్వండని నిలదీశారు. పబ్బులు నిబంధన పాటించేలా చూడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ ట్వీట్ లు చేసుడు కాదని..యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మైనర్ అమ్మాయి పై జరిగిన అత్యాచారం పై…హైకోర్టు..లేదంటే సుప్రీం కోర్టు సుమోటో కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు cj స్పందించి… సుమోటో గా స్వీకరించాలని…ఈ కేసులో హోంమంత్రి మనవడే ఉన్నారన్నారు.ఇన్నోవా వాహనం ఎవరిది అనేది తేలాలని..కేసు నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని అనుకుంటే… Cbi విచారణ కి ఆదేశించాలని కోరారు. హోంమంత్రి మీదనే ఆరోపణలు వస్తె… సీబీఐ విచారణ ఎందుకు చేయరు…రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. న్యాయపరంగా అన్ని తలుపులు తడతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news