వ్యాయామం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారా..? లేదంటే ఈ సమస్యలు రావడం ఖాయం

-

ఈ రోజుల్లో బరువు తగ్గడానికి కొందరు ఎక్సర్ సైజులు చేస్తుంటే… సన్నగా ఉన్నా..ఆరోగ్యంగా ఉండాలని మరికొందరు డైలీ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే.. తెలిసీ తెలియక వ్యాయామం చేసిన తర్వాత చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యంగా ఉండటం కంటే.. విపరీతంగా దెబ్బతింటుంది. అవును.. అసలే ఉరుకులపరుగులు జీవీతం..దేనికైన టైం కేటాయింటి ఆ టైంలో ముగించేసుకుంటాం.. అలానే.. ఈ టైం వరకూ ఎక్సర్ సైజులు చేయాలి.. చేసిన వెంటనే మన పనులు మనకు ఉంటాయి.. ఇలా ఇంట్లో ఉండి ఎక్సర్ సైజ్ చేసే వాళ్లు అయితే.. వెంటనే ఇంటిపనిలో మునిగిపోతారు.. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అంటున్నారు వైద్య నిపుణులు..
వర్కవుట్లు ముగించిన తర్వాత కాసేపైనా విశ్రాంతి తీసుకోకపోతే శారీరక, మానసికారోగ్యం దెబ్బతింటుందట. వ్యాయామ సమయంలో పెరిగే గుండె వేగాన్ని మెల్లగా అదుపులోకి తేవాలి. లేదంటే తల తిరిగినట్లు, వికారంగా అనిపిస్తుందట. కాబట్టి కొన్ని క్షణాలపాట ధ్యానం చేస్తే.. గుండె లయ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మనసూ ప్రశాంతంగా ఉంటుంది.. వ్యాయామాలు అయ్యాక పది నిమిషాలు కొన్ని తేలికైన ఆసనాలను వేస్తే కండరాల్లోని ఒత్తిడి క్రమబద్ధం అవుతుంది.
మొదట మోకాళ్లపై కూర్చుని రెండు చేతులను ముందుకు చాచి అరచేతులను, తలను కూడా నేలకు ఆనేలా నిమిషం పాటు ఉంచాలి. ఇలా రెండుమూడు సార్లు చేశాక యోగముద్రలో మరో 5 నిమిషాలుండి, ఆ తర్వాత శవాసనం వేస్తే చాలు. క్రమేపీ శరీరంలోని గుండె సహా అవయవాలపై ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. యధావిధిగా రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. వ్యాయామాలతో ప్రయోజనాలనూ పొందొచ్చు.
వ్యాయామం తర్వాత హాట్ బీట్ విపరీతంగా ఉంటుంది.. అదే లెవల్లో ఉన్నప్పుడు మీరు బాడీకీ రెస్ట్ ఇవ్వకుండా.. పనులు చేసుకుంటుంటే.. ఇంది గుండె ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపిస్తకుంది. కొన్ని సార్లు ప్రాణంతంకం కూడా కావొచ్చు. ఎన్నో ఘటనలు ఉన్నాయి.. వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయినవి.. కాబట్టి.. వ్యాయామం చేశాక.. కాస్త మీకు మీరు టైం ఇచ్చుకుని.. రెస్ట్ తీసుకోండి.!

Read more RELATED
Recommended to you

Latest news