జైలు నియమాల ప్రకారం ములాఖత్ లో ఒక్కొక్కరిని ముగ్గురు కలిసే వీలు ఉంటుంది. చంచల్ గూడ జైలులో ఉన్న 18 మంది విద్యార్థులను కలిసేందుకు 60 మంది వరకు అవకాశం ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం దుర్మార్గమైన, అనాగరిక చర్యలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. అధికారం ఉంది కదా అని పోలీసులతో నడపాలనుకుంటే కుదరదని… ఇది నైతికంగా కేసీఆర్ పతనానికి దారి తీస్తుందని… కేసీఆర్ మెడలు వంచుతామని, త్వరలోనే కేసీఆర్ గద్దె దించుతామని హెచ్చరించారు. జైలు నిబంధనల ప్రకారం అధికారులను పనిచేయనీయడం లేదని విమర్శించారు. కేసీఆర్ దుర్మార్గాలకు అనుమతులు ఇవ్వకపోవడం అద్దం పడుతోందని.. భారీ మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించాడు. జాతీయ పార్టీలకు నాయకత్వం వహించే వారు ఏ రాష్ట్రంలో అని పర్యటించ వచ్చని.. కేటీఆర్ పొలిటికల్ టూరిస్ట్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కూడా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలకు వెళ్తున్నారని.. ఆయన రాహుల్ గాంధీ కన్నా పెద్ద లీడరా అంటూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ పతనం ప్రారంభం అయింది… గద్దె దించుతాం: రేవంత్ రెడ్డి
-