రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ లో నోరు తెరవకపోయినా… 2009లో కేసీఆర్ ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందన్నారు. పాలమూరులో ఏ ప్రాజెక్టు కట్టినా కొల్లాపూర్ ప్రజల భూములే గుంజుకున్నారని ఆయన విమర్శించారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ నిర్వాసితులందరినీ ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 2018లో కొల్లాపూర్ లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని, కానీ అభివృద్ధి ముసుగులో ఆ నల్లికుట్లోడు దొరగారి దొడ్లో చేరాడంటూ ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలి. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు మీరు గెలిపించండి. రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం. గ్రామ గ్రామాన తిరగండి… ప్రతీ తలుపు తట్టండి.. తిరగబడదాం.. తరిమికొడదాం.. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు 5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టొద్దు..
కాంగ్రెస్ వస్తుంది… డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తుంది.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.