కేసీఆర్ నిరుద్యోగులనే కాదు… అందర్ని మోసం చేశారని.. 12 నెలల్లో ప్రభుత్వం రద్దు అవుతుందని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2018లో పే రివిజన్ కమిటీ చైర్మన్ బిస్వాల్ 1.91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చారని.. 61 శాతం ఉద్యోగులతోనే రాష్ట్రం నడుస్తుందని నివేదిక ఇచ్చారు. కానీ ఈరోజు నిస్సిగ్గుగా… 80 వేల ఉద్యోగాలు ఉన్నాయని అసెంబ్లీలో మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 నెలల్లో ప్రభుత్వం రద్దు… 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: రేవంత్ రెడ్డి
-