తెలంగాణకు వ్యతిరేఖంగా ప్రధాన నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా సీఎం కేసీఆర్ ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఉద్యమ ద్రోహులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, మాగంటి నిరసనల్లో పాల్గొన్నారని.. ఇలాంటి ద్రోహులు సమైక్యవాదులతో కలిసి పని చేసిన వారు నల్లనల్ల రేబన్ అద్దాలు పెట్టుకుని బుల్లెట్లపై బయలు దేరారని.. వాళ్లకు బుద్ది ఉందా.. అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అన్నం తినేటోడు ఎవడైనా నిరసన కార్యక్రమాలకు షూటింగ్ కార్యక్రమాలకు వచ్చినట్లు వస్తారా.. అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత ఎక్కడా కూడా ఆందోళనల్లో పాల్గొనలేదని.. మోదీ అంటే మీకు భయమా.. అభిమానమా అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే మీ దోొపిడీపై విచారణ జరపుతారని భయపడుతున్నారా..? అని ప్రశ్నించారు. మేము మోదీ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపు ఇచ్చాక… టీఆర్ఎస్ నాయకులు తూతూ మంత్రంగా నిరసనలు చేశారని విమర్శించారు. కేసీఆర్, మోదీ మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ ఆరోపించారు. మీరు బీజేపీకి లొంగిపోయారని.. మోదీకి తాబేదార్లుగా మారరని విమర్శించారు. మోదీ.. తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తుంటే.. కేసీఆర్ ఎందుకు ధర్నాలో పాల్గొన లేదని అన్నారు.
తెలంగాణ ద్రోహులు నిరసనల్లో పాల్గొన్నారు… కేసీఆర్ ఎక్కడికి పారిపోయారు – రేవంత్ రెడ్డి
-