కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుంది : రేవంత్‌ రెడ్డి

-

గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలను మంగళవారం పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ రేవంత్‌ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ వచ్చినా పాలమూరు గోస తీరలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు రేవంత్‌ రెడ్డి.

Congress revs up poll machine in Telangana with Revanth Reddy padayatra  from 6 February - The South First

మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు రేవంత్‌ రెడ్డి. జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినవే అని తెలిపారు. కాంగ్రెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు రేవంత్‌ రెడ్డి.

చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి ఆయా వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news